పుట:VrukshaSastramu.djvu/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

369

పిమ్మట బెరడును గొయ్యవచ్చును. మానుకును చుట్టుగాక రెండు వైపులనే గోయుదురు. కోయుట వర్షకాలములో నయ్యేఅ బెరడు సులభముగ వచ్చును. బెరడును గోసిస తరువాత నొక చెక్కమీద నొక దానిని జేర్చి గట్టిగా బిగించి కట్టి ఒక దినముంచెదరు. మరునాడు ఆ చెక్కలపై నున్న పొరను కత్తితో గీసి వైచి వానిని నీడలో ఆర బెట్టుదురు. దానినే ముక్కలుగా కోసి అమ్మదెచ్చు చున్నారు.

దాల్చిన అరకు, ఆకులనుండియు వ్రేళ్ళనుండియు గూడ తీయుదురు. చెక్కను వేళ్ళను గూడ ఔషధములలో వాడుదురు. దాల్చిన చెక్క సుగంధ ద్రవ్యములలో నొకటి.

ఈ చెట్లలో చాలరకములు గలవు.

తాళసపత్రి కొందలమీద బాగుగ పెరుగును. తోటలలో దీనిని తరచుగా, పనస, పోక చెట్లతో గలసి పెంచుదురు. విశేష వర్షము వెంటనే తీక్షణమగునెండ, ఇట్లు ఒక దానివెనుక నొకటి యున్నచో అవి బాగుగ పెరుగును. వర్షము సర్వదా గురియు చున్న యెడల సువాసన తగ్గును. వీని విత్తనములు పాతిన 5 ఏండ్లకు మొక్కలను దీసి దూర దూరముగా పాతుదురు. కొన్నిచోట్ల చిన్నమొక్క అడుగెత్తుగా నున్న