Jump to content

పుట:VrukshaSastramu.djvu/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

368

అండకోశము
అండాశయము ఉచ్చము ఒక గది. పుష్పనిచోళములో అడుగు గా నుండును. కీలము అండాశయము చివర నుండియే వచ్చు చున్నది.

ఈ కుటుంబపు మొక్కల ఆకులు సువాసన వేయును. ఆకులలో గ్రంధి కణములు గలవు. అవి ఒంటరి చెరికగా నున్నవి. వానికి, కణుపు పుచ్చములు లేవు. పుష్ప మంజరులు కణుపు సందులందుండి మధ్యారంభ మ్ంజరులుగా వచ్చు చున్నవి. కింజల్కములు రెండు మూడు వరుసలుగా నుండును. వానిలో కొన్నిటి మొదట గ్రంధి కణములు గలవు. అండాశయమొకగది.

దాల్చిన చెట్లను మన దేశములో అంతశ్రద్ధతో పెంచుట లేదు. అవి పడమటి కనుమల మీద బెరుగు చున్నవి. సాధారణముగ అన్ని నేలలందును పెరుగ గలవుకాని, మంచి నేలలు కానిచో చెక్క బాగుండదు. ఈ చెట్లు కొమ్మలను పాతినగాని గింజలనుబాతినగాని మొలచును. ఆరేడడుగుల దూరమున గోతులు తీసి వానిలో నాలుగైదేశ కాయలను పాతుదురు. మొక్కలు బాగుగ నెదిగిన పిమ్మట వానిని గురించి మనమంత జాగ్రత పుచ్చుకొన నక్కర లేదు. వాని చుట్తు నుండు చెత్త మొక్కలను పెరిగి వైచిన చాలును. కొంత ఎత్తు ఎదిగిన పిమ్మట వాని చిగుళ్ళను గోసి వేయుదురు. ఆరేడేండ్లెదిగిన