ఈ పుట ఆమోదించబడ్డది
367
కాయల పైచర్మమె జాపత్రి. దీని నొలవగనే ఎండలో పెట్టుదురు.
జాజి కాయలనుండియు జాపత్రినుండియు కూడ చమురు దీసి దానిని సుగంధ ద్రవ్యములలో వాడు చున్నారు. దీనిని మనము తరుచుగ గాంబూలమునందు వాడు చున్నాము. వీనిని ఔషధములలో కూడ వాడు చున్నారు.
దాల్చిన కుటుంబము.
దాల్చిన చెట్టు మనదేశ్ములో ఎక్కువగాలేవు.
- ఆకులు
- - ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము దట్టముగాను బిరుసు గానుండును. రోమములు లేవు. మూడు పెద్ద ఈనెలు గలవు. కొనగుండ్రము. ఆకులకు సువాసన గలదు.
- పుష్ప మంజరి
- - కణుపు సందులందుండి మధ్యారంభమంజరులగు రెమ్మ గెలలు. ఇవి ఆకులకంటె పొడుగగా నున్నవి. వాని మీదరోమములు గలవు. మిథున పుష్పములును స్త్రీ పుష్పములును గలవు. స్త్రీ పుష్పములు పెద్దవి.
- పుష్పవిచోళము
- - సంయుక్తము. 5 తమ్మెలు గలవు. ఇవి కొంచెము హెచ్చు తగ్గుగ సమముగనే యున్నవి.
- కింజల్కములు
- - 9 తొమ్మిదికి తక్కువకూడ గలుగుచుండును. ఒక వరుస గొడ్డుకింజల్కములు గూడ కలవు. మూడవ వరుస వానిలో గ్రంధి కణములున్నవి. పుప్పొడితిత్తులు నాలుగుగదులు.