పుట:VrukshaSastramu.djvu/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

ఈతాకులనైనను దేనినైనను గప్పి నీరు బోయుదురు. ఈ తీగెల నతి శ్రద్ధతో జూచు చుండ వలయును. ఇవి ప్రాకుటకు గొన్ని చోట్ల అవిశ ములగ చెట్లను పెంచెదరు. కొన్ని చోట్ల పోక చెట్టుల మీదనే ప్రాకనిచ్చెదరు. తామలపాకుల రసము ఔషదములలో కూడ వాడుదురు. తామలపాకుల పంట వలన ఎకరమునకు రెండు సంవత్సరములలో రూపాయలు 300 మొదలు 560 వరకు రావచ్చును.

పిప్పిలి తీగెలు మనదేశములో పలు భాగములందు పెరుగును. వీని ఆకులు పెద్దవ్. పుష్పములలో స్త్రీ, పురుష భేదము గలదు. ఇవి పెరుగుటకు సార వంతమైనవియు, ఎత్తుగా నున్నట్టియు, మెరక నేలలుగావలయును. వీనికి భూమిలో కొంత దూరము ప్రాకి అచ్చట బైకి వచ్చు కొమ్మలు గలవు. వీనిని దీసి పాది పైరు చేయుదురు. వేరులను ఎండబెట్టిన కాయలను ఔషధములలో వాడుదురు.

చలవమిరియముల తీగెను మనదేశమున కన్య దేశములనుండి తెచ్చిరి. దానినక్కడక్కడ పెంచుచున్నారు. చలవమిరియములను తాంబూలమునందును ఔషధములందును వాడుదురు.