Jump to content

పుట:VrukshaSastramu.djvu/369

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

365

జాజి కుటుంబము.


జాజి చెట్టు ముప్పది నలుబది అడుగు లెత్తు పెరుగును. ఇది ఏక లింగ పుష్పము.

ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు చిన్నవి. సమాంచలము. సమ గోళాకారము. విషమ రేఖ పత్రము. ఆకు బిరుసుగా నుండును. కొన వాలము గలదు.
పుష్పమంజరి
- మగ పుష్పములు తెలలు, ఏక లింగ పుష్పములు చిన్నవి. అసంపూర్ణము. స్త్రీ పుషమొక కణుపు సందున నొకటియె. ప్రతి పువ్వు వద్ద చేటిక గలదు.
పురుష పుష్పము
పుష్పవిగోళము
- సంయుక్తము 3 చిన్న తెమ్మెలు, నీచము
కింజల్కములు
- తొమ్మిది మొదలు పండ్రెండు వరకు అన్నియు గలసి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
పుష్పనికోశము
- పైదాని వలె నుండును.
అండకోశ ముచ్చము. ఒకటియే స్త్రీ పత్రము, అండము ఒకటి గింజకు బీజ పుచ్ఛము గలదు., కీలము లేదు. కీలాగ్రములు రెండు.

ఇదియొక చిన్న కుటుంబము. దీనిలో చిన్న చిన్నమొక్కలులేవు. ఆకులు ఒంటరి చేరిక. సమాంచలము చిన్నఏక