Jump to content

పుట:VrukshaSastramu.djvu/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

363

రంభించును గాన నాదీగెలను దీసివేసి క్రొత్త వానిని బ్రాకించెదరు. గెలలోని పై కాయలు రంగు మారుట నారంభింపగనే కాయలను కోసి వేసి ఎండలో బెట్టుదురు. మిరియములలోను రెండు మూడు రకములున్నవి. కొన్ని పెద్దవి. కొన్ని చిన్నవి. కొన్ని ఎక్కువనొక్కులు నొక్కులుగానుండును.

కొందరు మెరపకాయలకు బదులుగా మిరియములనే వాడుకొందురు. మిరియములు చాల లనుపానములలో ఉపయోగించు చున్నారు. మిరియపు పొడియు వంటికి మంచిది. చిర కాలమునుండి మన దేశ్మునుండి మిరియములు చాల ఎగుమతి అగు చున్నవి.

తామలపాకులు చిరకాలమునుండి మనదేశములో పలు భాగములందు పైరు చేయుచున్నారు. తమలపాకుల లోను మూడు నాల్గు రకములు న్నవి. ఒరిస్సా ప్రాంతముల పొగాకుతో వేసికొను తాంబూలములకు ప్రత్యేకముగ నొక విధమగు ఆకు గలదు. అది జీడి గింజ ఆకారముగ నుండును. మిక్కిలి దట్టముగను, ముదురుగు రంగుగను కారముగను నుండును. రెండేండ్ల తీగల ముక్కలను రెండు మూరలో ఎంతో గోసి రెండుమూడు కణుపుల భూమిలో పాతి, మిగిలినతీగ పై