Jump to content

పుట:VrukshaSastramu.djvu/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

347

ప్రకాండము
- నాలుగు పలకలుగా నున్నది.
ఆకులు
అభిముఖ చేరిక. లఘు పత్రములు. తొడిమ పొడుగు. కణుపు పుచ్చములు లేవు. పత్రము అండాకారము. కొన సన్నము. విషమ రేఖ పత్రము. ఈనెల మీద రోమములు గలవు.
పుష్ప మంజారి
- కొమ్మల చివరల నుండి గాని, కణుపు సందులనుండి గాని కంకులు. వీని మీద ఒక్కొక చోట మూడేసియో నాల్గేసియో పువ్వులు కలవు. వీని క్రింద చేటికలు గలవు. వీనిలో మధ్య పుష్పము మొదట వికసించును గాన నివి మధ్యారంభ మంజరులు. పువ్వులు చిన్నవి. ఆసరాళములు.
పుష్ప కోశము
- సంయుక్తము ఓష్టాకారము. పై పెదవి కొంచెము గుండ్రముగా నున్నది. క్రింది దానికి నాల్గు దంతములు గలవు నీచము.
దళవలయము
- ఆరంగుళముల లోపుగా నుండును. సంయుక్తము ఓష్టాకారము. పైపెదవికి నాల్గు దంతములు గలవు.
కింజల్కములు
- 4 దళవలయపుటడుగు పెదవిపై నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాకారము ఇవి ఒక చోటనే పగులును.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. దీనికి నాల్గు తమ్మెలున్నవి. కీలము ఈ తమ్మెల మధ్య నుండి వచ్చును. కీలాంగ్రము రెండు చీలికలు. ఇది పుష్ప కోశములో నడగియుండును. పగిలి నాలుగగా చీలును. ఇవి గింజలను కొందుము గాని నిజమైన గింజలు వీనిలోపల నొక్కటి గలదు.