పుట:VrukshaSastramu.djvu/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

345

నెమలి అడుగు చెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. ఆకులు మిశ్రమ పత్రములు. పువ్వులు చిన్నవి. దీని కలప కొంచెమెర్రగా నుండును. ఇది పెట్టెలు బీరువాలు చేయుటకు పనికి వచ్చును.

బ్రాహ్మిణి చెట్టు గుబురుగా పెరుగు చిన్న మొక్క. ఆకులొక్కొకచోట మూడో నాలుగో యుండును. పువ్వులు మొదట తెల్లగా నుండును. కాని క్రమముగా ఎర్రబారును.
తులసి మొక్క మన దేశము నందంతటను పెరుగు చున్నది.
ప్రకాండము
నాలుగు పలకలుగా నున్నది. దీని మీద రోమములు గలవు.
ఆకులు
లఘు పత్రములు. అభిముఖ చేరిక. తొడిమ గలదు. కణుపు పుచ్ఛములు లేవు. పత్రము అండాకారము. విషమ రేఖ పత్రము. అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. దీని మీదస్ను రోమములు గలవు. దీని కొక విధమగు వాసన గలదు.
పుష్ప మంజరి
కొమ్మల చివర ప్రతి కణుపు నందును మధ్యారంభ మంజరులుగ నున్నవి. వీనికి చేటికలు గలవు. పువ్వులు చిన్నవి. అసరాళము. సంపూర్ణము ఓష్టారకారము
పుష్ప కోశము
సంయుక్తము. 5 దంతములు గలవు. నీచము స్థిరము కాయతో గూడ బెరుగును. కాయ కంటె నిది పెద్దది.

346


తులసి కుటుంబము.

తులసి మొక్క
డళ వలయము
- సంయుక్తము. ఓష్టాకారము
కింజల్కములు నాలుగు. రెండు పెద్దవి రెండు చిన్నవి. ఇవి దళవలయము యొక్క అడుగు భాగము నంతు కొని యుండును.

అండ కోశము:- అండాశయము ఉచ్చము. రెండు గదులు అండములు 4 కాయ నాలుగు చీలికలుగానగును. కీలముఅండాశయము అడుగు నుండి బయలు దేరు చున్నది. కీలాగ్రము రెండు చీలికలు.

రుద్రజడను తోటలలో బెంచుచున్నారు.