పుట:VrukshaSastramu.djvu/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

ఈకుటుంబములోని మొక్కలు చిన్నవి. వాని యాకులు అభిముఖ చేరిక. వానికి గణుపు పుచ్ఛములు లేవు. ఆకులకు కొమ్మలకు ఒక విధమగు వాసన గలదు. పుష్ప కోశము సాధరణముగా కాయతో బెరుగు చుండును. దళ వలయము ఓష్టాకారము. కింజల్కములు నాలుగు. అండాశయము ఉచ్చము. కీలము అండాశయమున కడుగున నుండి వచ్చును. ఇదియే ముఖ్య లక్షణము. కాయలెండి పగులును. ఈ కుటుంబము అడ్డసరపు కుటుంబమును టేకు కుటుంబమును పోలి యుండును. ఈ కుటుంబపు మొక్కలలో గింజల్కములు నాలుగో రెండో పై జత పెద్దదో, అడుగు జత పెద్దదో, పుప్పొడి తిత్తులు కలిసియున్నవో విడిగా యున్నవో మొదలగు అంశములను బట్టి జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు.

తులసి మొక్క మనకు మిగుల గౌరవ మైనది. దానిని మనము పూజింతుము.

రామతులసి కృష్ణ తులసి కంటె (పైదాని కంటే) ఎక్కువ వాసన వేయును. దీని ఆకులు నిడివి చౌక పాకారము.

రుద్రజడ ఆకులు మంచి వాసనవేయుటచే దానిన తోటలలో బెంచు చున్నాము. దీని గింజలు నీళ్ళలో వేసిన ఉబ్బును. వీనిని ఔషధములలో గూడ వాడుదురు.