Jump to content

పుట:VrukshaSastramu.djvu/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

340

పుష్పకోశము
- చిన్నది సంయుక్తము అయిదు దంతములు గలవు. నీచము.
దళవలయము
- సంయుక్తము అసరాళము నాలుగు తమ్మెలు అడుగున నున్న తమ్మె పెద్దది.
కింజల్కములు
- నాలుగు రెండు పెద్దవి. రెండు చిన్నవి. పొడుగా నున్నవి లోపలకు వంగి యుండును.
అండకోశము
- అండాశయము ఉచ్చము నాలుగు గదులు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వ్రేలాడు చుండును. కీలము కింజల్కము లంత పొడుగు. కీలాగ్రము రెండు చీలికలు. ఒక చీలిక పెద్దది. కాయ చిన్నది పండి వచ్చగానుండును.


ఇది యొక పెద్ద కుటుంబము. ఈ కుటుంబపు మొక్కలు మన దేసములో చాలనే యున్నవి. ఆకులు అభిముఖ చేరిక, లఘు పత్రములు. సమాంచలము. పుష్పములు అసరాళములు. కింజల్కములు దళ వలయపు తమ్మెల కంటె తక్కువ యుండును. అండ కోశము నాలుగు గదులు, ఒక్కొక్క గదియందొక్కొక యండము గలదు. ఈ కుటుంబము కొంచెము అడ్డసరము కుటుంబమును బోలి యుండును. ఈకుటుంబమును పెద్ద చెట్లో తీగెలో, గుబురు మొక్కలో, పుష్ప మంజరి యెట్టిదో అండాశయమున నొక గదియో, ఎక్కువయున్నవో, కాయ కండ కాయయో, ఎండు కాయయో వీనిని బట్టి జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.