పుట:VrukshaSastramu.djvu/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

339

పుష్పమంజరి
కొమ్మల చివరలనుండి మధ్యారంభమంజరులు పువ్వులు చిన్నవి. చాలయుండును పశుపు రంగు అసరాళము సంపూర్ణము ఉప వృంతముల వద్దను పుష్ప కోశముల వద్దను చేటికలు గలవు.
పుష్పకోశము
- సంయుక్తము అయిదు తమ్మెలుగ చీలి యున్నది. ఇది కాయ నంటి పెట్టుకొని పెద్దది కాదు. నీచము.
దళవలయము
- సంయుక్తము అసరాళము ఓష్టాకారము గొట్టము పొట్టి తెమ్మెలు అయిదో నాలుగో యుండును.
కింజల్కములు
- నాలుగు కాడలు దళవలయము నంటు కొని యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

అండ కోశము:- అండాశయము ఉచ్చము. నాలుగు గదులు ఈ గదులు పూర్తిగ వేరు వేరుగ లేవు. ఒక్కొక్క దాని యందొక్కక్క అండము వ్రేలాడు చుండును. కీలము కింజల్కము అంత పొడుగు కీలాఅగ్రము రెండు సన్నని చీలిక.

గుమ్మడి
- చెట్లు మన దేశములో విరివిగా పెరుగు చున్నవి. మ్రాను నిడివిగా నుండి కొమ్మలు నలుదశలా వ్యాపించి యుండును.
ఆకులు
- అభిముఖ చేరిల లఘు పత్రములు, హృదయాకారము పది అంగుళముల పొడగు కూడ నుండును. సమాంచలము విషమ రేఖ పత్రము. అడుగు ప్రక్కన రోమములు గలల్వు. పత్రముతో దొడిమ కలియు చోట రెండో మూడో పెద్ద గ్రంధి కోశములు గలవు.
పుష్ప మంజరి
- కొమ్మల చివరల నుండి మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు పుష్పముల వద్ద చేటికలు గలవు. ఇవిత్వరగా రాలి పోవును. పువ్వులు అసరాళము.