ఈ పుట ఆమోదించబడ్డది
338
- టేకు చెట్టు
కింజల్కములు:- దళవలయపు తమ్మెలన్ని యున్నవి. కాడలు దళ వలయమును నంటి యున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు అవి నిడివి చౌక పాకారము.
అండ కోశము:- అండాశయము ఉచ్చము. నాలుగు గదులు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క అగింజ గలదు. కీలము సన్నము కీలాగ్రము రెండు చీలికలు లో పెంకు కాయ.
మడ చెట్టు:- సముద్ర తీరములను గాలువల వద్దను మొలచును.
- ఆకులు
- - అభిముఖ చేరిక అధశ్చిర అండాకారము తొడిమ పొట్టి సమాంచలము. కొనగుండ్రము.