పుట:VrukshaSastramu.djvu/341

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

337

నీలాంబరము యొక్క నీలపు పువ్వులందముగా నుండును గాన తోటలందు పెంచు చున్నారు.

పెద్దములుగోరింటలో ఆకుల కంటె నిలుడుపైన ముళ్ళు కలవు.

తెల్లములు గోరింట వర్షాకాలములో పుష్పించును. దీని కాయలో చాల గింజలు గలవు.

పచ్చవాడాంబరములో పై పెదవి వెనుకకు వంగి యున్నది.


టేకు కుటుంబము

టేకుచెట్టు ఎనుబది మొదలు నూటయేబది యడుగుల వరకు బెరుగు పెద్ద వృక్షము.

ఆకులు : - అభిముఖచేరిక. లఘుపత్రములు సమాంచలము అడుగున మెత్తని రోమములు గలవు. కొన సన్నము.

పుష్పమంజరి : - కొమ్మల చివరలనుండి ద్వివృంత మధ్యారంభమంజరులగు పెద్దరెమ్మ గెలలు. ప్రతిపుష్పమువద్దను చిన్న చేటిక గలదు.

పుష్పకోశము : - సంయుక్తము గొట్టమువలె నుండును. అయిదో, ఆరో, తమ్మెలుండును. నీచము. అదికాయనంటిపెట్టుకొని దానితోగూడ బెద్దదగును.

దళవలయము : - సంయుక్తము గొట్టము పొట్టి తమ్మె లైదో, ఆరో యుండును. తమ్మెలన్నియు -సమముగా నే యుండును.