ఈ పుట ఆమోదించబడ్డది
336
కాయలుగాయదు. తోటలలో దాని కొమ్మలు నాటి పెంతురు. దాని వ్రేళ్ళస్తో గాచిన పాలు వీర్య వృద్ధి చేయునందురు. ఈ వేళ్ళను నిమ్మకాయ రసముతోడును, మిరియములతోడన నూరి పట్టించిన తామర పోవును. పాము కాటునకు నాగ మల్లి మొక్క మంచి పని చేయు నందురు గాని, చేసినట్లువిన వచ్చుటలేదు.
నేలవావిలి ఒక అందమైన మొక్క, అది వర్షాకాలములో పుష్పించును.
చేబీరమొక్క డొంకల వద్ద పెరుగును. ఏడాదిలోనే పుష్పించి చచ్చి పోవును.
నేలమర మొక్క పచ్చిక బయళ్ళ మీదను చెట్ల నీడలను పెరుగును. భూమి పైన దీని ప్రకాండమనుపడదు. దీని గింజలు చిక్కుడు గింజలవాలె వంపుగానుండును.
జీమందారితీగ పువ్వులు మంచి వాసన వేయును. దీని పువ్వులు ఓష్టాకారముగ లేవు.
ముల్లుగోరింట అందముగానుండును. దీనిపువ్వుగరాటివలెనున్నది. కింజల్కములు నాలుగు, రెండు పెద్దవి. రెండు చిన్నవి.