పుట:VrukshaSastramu.djvu/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

335

చుటకై గింజలు దూరదూరముగా బడు నట్లు కాయల యందీ ఏర్పాటు గలిగినది.

ఈ కుటుంబములోనికల్ల మిక్కిలి యుపయోగ మైనది అడ్డసరము చెట్టు. ఇది అన్ని దగ్గులకును మంచి మందు. కాని క్షయ రోగమునకంతగా బనిచేయ దందురు.

దీని ఆకులను పనస చెక్క యొక్క రంపపు పొట్టుతో గలసి కాచి యొక విధమగు పచ్చని రంగు చేసెదరు. అడ్దసరపు ఆకులతో దమ్ము చేసిన ఎడల వరి చేలు మిక్కిలి సార వంతములగును. దీని బొగ్గును తరుచుగా దుపాకి మందునకు ఉపయోగింతురు. దీని చెక్కతో గొన్ని రుద్రాక్షలు కూడ చేయు చున్నారు.

నేలవేము కూడ ఔషదములందు పనికివచ్చును. చిన్నపిల్లల కడుపు నొప్పికిని, అజీర్ణముచే కలుగు జ్వరములకును దీని ఆకుల రసము నిత్తురు. ఈ రసము మిక్కిలి చేదుగా నుండును గాన ఒక్కొక్కప్పుడు, ఏలకుల పొడుము దీనితో కలిపి మాత్రలు చేయుదురు.

నాగమల్లి అయిదారు అడుగులఎత్తు పెరుగు గుబురు మొక్క. అది సంవత్సరము పొడుగున పుష్పించును కాని