ఈ పుట ఆమోదించబడ్డది
334
- కింజల్కౌలు
- - రెండు కాడల పై భాగమునందు రోమములు గలవు. దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు వెడల్పుగానుఅధశ్శిర అండాకారముగను నున్నవి.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము రెండు గదులు ఒక్కొక్క గది యందు మూడు నాలుగు అండములుండును.
- కీలము
- - క్రింది భాగమున రోమములు గలవు. కీలాగ్రము రెండు చీలకలు.
ఈ కుటుంబపు మొక్కలు ఉష్ణదేశములందు విరివిగా పెరుగుచున్నవి. వీనిలో గుబురు మొక్కలు, గుల్మములే గాని పెద్ద వృక్షములు లేవు. ఆకులు అభిముఖ చేరిక. లఘు పత్రములు సమాంచలము. సాధారణముగా చేటిక లుండును. దళ వలయము సంయుక్తము. ఓష్టాకారముగా నైనను, అసరాళముగా నైనను వుండును. కింజల్కములు రెండో, నాల్గో యుండును. కాని, ఎందును అయిదుండవు. అండ కోశము ఉచ్చము. రెండు గదులు. కాయ బహు విధారుణ ఫలము. కాయలెండి రెండు మూడు చోట్ల పగులును. అదివరకు గలసి యున్న డిప్పలు హఠాత్తుగ విచ్చుట చే లోపలి గింజ లెగిరి కొంచెము దూరముగా బడును. అట్లుగాక గింజలన్నియు తల్లిచెట్టునకు దగ్గరగా బడి మొలచిన యెడల అచ్చోట దొరకు నాహారము చాలక చచ్చిపోవలసిన వచ్చును. అట్టిహాని నివారిం