ఈ పుట ఆమోదించబడ్డది
333
కింజల్కములు:- రెండుదళవలయములనంటి యున్నవి. కాడల క్రింది భాగము వెడల్పుగా నుండును. అచ్చట రోమములు గలవు. పుప్పొడి తిత్తుల గదులు సమముగా లేవు. క్రింది గదికి వాలము గలదు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. సంయుక్తాండాశయము నాలుగు అండములు.
- కీలము గుండ్రము కీలాగ్రము రెండు చీలికలుగ నున్నది.
- నేల వేము
- - నేల వేము మెట్టతావులయందు చెట్ల నీడలను ఒకటి మొదలు మూడు అడుగుల వరకు తుప్పల వలె పెరుగును.
- ప్రకాండస్ము
- - నాలు పలకలుగా నున్నది.
- ఆకులు
- - అభిముఖ చేరిక. లఘు పత్రము కణపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ బల్లెపాకారము. సమాంచలము విషమ రేఖ పత్రము రెండు ప్రక్కల సున్నగా నుండును.
- పుష్ప మంజరి
- - కొమ్మల చివరలందుండి గెలలు ఉప వృంతములు గలవు.
- పుష్ప కోశము
- - అసంయుక్తము రక్షక పత్రములు 5 నీచము.
- దళ వలయము
- - ఓష్టాకారము. పై పెదవి యందు తమ్మెలు మూడు తెలుపు రంగు. అక్కడక్కడస గులాబి రంగు చుక్కలు గలవు. దశవలయము నందంతట రోమములు గలవు. మొగ్గలో అల్లుకొని యుండును.