పుట:VrukshaSastramu.djvu/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

అండకోశము
- అండాశయము ఉచ్చము. రెండు గదులు నాలుగు అండములు.

కీలము: అండాశయ శిఖరమునుండి పుట్టును గుండ్రము.

శీలాగ్రము గుండ్రము రెండుగా చీలి యుండుటయు గలదు.
ఫలము
రెండు గదులు గట్టిగా నుండు కాండల నంటి నాలుగు గింజలుండును. బహువిదారున ఫలము
నేలవావిలి
- తరుచుగా తోటలందు పెంచుదురు. గుబురు మొక్క. రెండు మొదలు నాలుగు అడుగుల ఎత్తు పెరుగును బెరడు కొంచెమాకు పచ్చగా నుండును.
ఆకులు
- అభిముఖ చేరిక. లఘు పత్రము కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ పత్రము బల్లె పాకారముగు. సమాంచలము. విషమ రేఖ పత్రము. రెండు ప్రక్కల నున్నగా నుండును. కొన సన్నము.
పుష్ప మంజరి
కొమ్మల చివరల నుండి రెమ్మకంకులు. వృంతము మీద అపుష్పములు గుత్తులు గుత్తులుగా నుండును. క్రింది గుత్తులు దూర దూరముగా నుండును. చేటికలు గలల్వు. ఇవి సన్నముగాను, దళవలయమున కంటే పొట్టివిగా నుండును.
పుష్ప పోశము
- అసంయుక్తము రక్షకపత్రములు 5 నీచము, ఆకు పచ్చని రంగు
దళ వలయము
- సంయుక్తము ఓష్టాకారము. తెల్లగానైనను గులాబి వర్ణముగానైఅనను నుండుడు. మొగ్గలో అల్లుకొని యుండును.