341
టేకుచెట్లు హిందూదేశమునందు పలుతావుల బెరుగుచున్నవి. కాని మన తెలుగు దేశమునందు తక్కువ. ఇప్పుడిప్పుడు మన్యములందును, అడవుల్లోను నాటి పెంచు చున్నారు. అవి అన్ని మంచి నేలలోను పెరుగ గలవు గాని ఒండ్రు మట్టి భూములందు బాగుగ పెరుగును. వానికి సమమగు శీతోష్ణ స్తితులు చేకూరక ఏది విస్తారముగ నుండినను నేపుగా పెరుగ లేవు. గింజలను నాతి రెండు మూడడుగులు పెరిగిన తరువాత ఆ చిన్న మొక్కలను దీసి దూర దూరముగ పాతెదరు. పెద్ద చెట్లను వేరు చోట్ల బాతుచో తల్లి వేరు విరిగి పోవుట తటస్థించును. కావున చిన్నవి గా నున్నప్పుడే తీసి పాత వలెను. కొన్ని చోట్ల గింజలను మొదటనే దూర దూరముగ పాతుదురు. అడవులలో టేకు చెట్లు మొలచు చోట వెదురు కూడ మొలచును. వెదురు మొక్కలు మిక్కిలి దట్టముగా నున్న యెడల చిన్న టేకు మొక్కలు ఎండయు, వెలుతురు తగులక చచ్చి పోవును కాన వెదురును నిర్మూలన చేయుటకు అడవులను తగుల బెట్టు చుందురు. ఒక్కొక్కప్పుడు కొన్ని పక్షులు ఏవో గింజలను ఈ చెట్లమీద రాల్చును. ఈ గింజలు మొక్కలు మొలచిన యెడల టేకు చెట్ల సారము లాగి వేయు చుండును. గాన వాని నెదుగ నీయ కుండ చూచు చుండ వలెను. టేకు తెట్లను, భూమి మీద నుండి 5, 6 అడుగు లెత్తుగా నున్న చోట ఆరేడడుగులు చుట్టుకొలత యున్నప్పుడే నరుకుట మంచిది. సాధరణము