పుట:VrukshaSastramu.djvu/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

వరకు నీరుపోయుచుండవలెను. ఐదారు నెలలకు దుంపలు బాగుగ వూరును. సాగు చేయుటకు ఎకరమునకు నూట ముప్పది రూపాయలగును గాని ధర బాగుగ వున్న ఎడల మూడు వందల రూపాయల వరకు వచ్చును. కొన్ని చోట్ల వీని నుండి సారాయిని గూడ తీయు చున్నారు. మనము మాత్రము పులుసు, కూరలలోనె ఉపయోగిచు చున్నాము. దుంప తీసిన తరువాత తీగెను పశువులకు వేయుదురు.

మట్టపాలు తీగె వేరును ఔషధములలో వాడుదురు. దీని పువ్వులందముగా కూడ వుండును. ఈ తేగను గూడ పశువులు తినును.

తెల్ల తెగడ తీగె చాల కాలము బ్రతుకును,. తీగ (ప్రకాండము) నాలుగు పలకలుగ నున్నది., ఆకులన్నియు నొక రీతినే యుండవు. తెల్ల పెద్ద పువ్వులను పూయును. దీని వేరు బెరడు పాలతో అరగ దీసి యిచ్చిన విరోచనము లగునట.

తెల్ల అంటు తీగె. డొంకల మీద బెరుగును. తీగె కొంచె మెర్రగా నుండును. పువ్వులు పచ్చగాను చిన్నవిగాను వున్నవి.

తూటికూర మంచి నీళ్ళ చెరువులలో పెరుగును. తీగనీటిమీద తేలును. పువ్వులు గులాబి రంగు. లేతచిగుళ్ళను కూర వండుకొని తిందురు.