పుట:VrukshaSastramu.djvu/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

309

పుష్పకోశము
- అసంయుక్తము 5 రక్షక పత్రములు సన్నముగా నుండును నీచము.
దళవలయము
- సంయుక్తము 5 తమ్మెలు గలవు. సరాళము.
కింజల్కములు
- 5 దళ వలయమునంటి యుండును. పుప్పొది తిత్తులు రెండు గదులు.
అండకోశము
- అండాశయము ఉచ్చము 4 గలులు ఒక్కకదానియందొక్కయండమున్నది. కాని ఒకటియే సాధారణముగ ఎదుగును. గింజపై రోమములు గలవు. కీలము ఒకటి గుండ్రము.

ఈకుటుంబపు మొక్కలలో పెద్ద వృక్షములు లేవు. తీగలె విస్తారముగ కలవు. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. కణుపు పుచ్చములుండవు. పుష్పములు సరాళములు. దళవలయము మెలి వెట్టి నట్లుండును. కింజల్కములైదు. అండాశయములో సాధరణముగ రెండు గదులును ఒక్కొక్క దాని యందు రెండేసి గింజలుండును.

చిలగడ- దుంపలు మన దేశములో నంతట సేద్యము చేయుచున్నారు. ఇది యిసుక నేలలో బాగుగవూరును. వర్షముల ముందు దున్ని ఎకరమునకు ఏబది బండ్ల పెంట చొప్పున పెంటపోసి నాగటిసాలుగట్ల మీద ముదురు తీగె ముక్కలను పాతెదరు. పాతిన పదిపండ్రెండు దినముల