Jump to content

పుట:VrukshaSastramu.djvu/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

చిలగడదుంప కుటుంబము.


చిలగడ దుంప తీగె నేల మీదనే ప్రాకుచుండును. వేళ్ళు ఊరి పెద్దావగును.

ఆకులు
- ఒంటరి చేరిక హృదయాకారము. లఘు పత్రములు సమాంచలము కొన సన్నము. విష రేఖ పత్రములు. తొడిమలు పొడుగుగా వుండును.
పుష్ప మంజరి
- కణుపు సందులందుండి మధ్యారంభ మంజరులుగను వున్నవి. పువ్వులు పెద్దవి. సరాళను.
పుష్ప కోశము
- అసంయుక్తము. గరుకు పత్రములు ఐదు. సమగోపనారము. నీచము.
దళ వలయము
- సంయుక్తము. గరాట వలె నుండును. 5 ఆకర్షణ పత్రము కలిసి యున్నవి. మొగ్గలో మెలివెట్టి నట్లుండును.
కింజల్కములు
- అయిదు దళ వలయము నంటి వుండును. అన్నియు సమముగా లేవు. కొన్ని పొట్టి కొన్ని పొడుగు. కాడ అడుగున వెడల్పుగా నున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. 4 గదులు ఒక్కొక్క కాయయందొక్కొక్క యండము గలదు. కీల పొడుగు.
మట్టిపాల తీగ
పెద్ద తీగె.
ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, అడుగు వరకు చీలి యున్నవి. ఒక్కొక్క తమ్మె సమ గోళాకారము.
పుష్ప మంజరి
- కణుపు సందుల నుండి మధ్యారంబమంజరులు గలవు. పువ్వులు ఊదారంగు పుష్పములయొద్ద చేటికలు గలవు.