Jump to content

పుట:VrukshaSastramu.djvu/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

311

ఎఱ్ఱకత శీతాకాలములో పుష్పించును. లేత తీగల ల్మీద తెల్లని నూగు గలదు. కొమ్మలను విరచిన పాలు వచ్చును. పువ్వులు నీలపు రంగు.

కోకతీగ అడవులలో చెట్ల మీద ప్రాకెడు పెద్దతీగె. దీని ఆకులు పొడగుగా నుండును. పువ్వులు పెద్దవియె కాయ ఎండి ముక్కముక్కలుగ బ్రద్దలగును.

బురిడి తీగె అడవులలోనె యుండును. ఒక్కొక ఆకు వద్ద ఒక్కొక తెల్లని పుష్పముగలదు.

విష్ణు క్రాంతము:- ఆకుల తొడిమ చాల పొట్టిది. ఆకుల వద్ద మూడేసి పువ్వులున్నవి.


వంగ కుటుంబము.


వంగ మొక్క బహు వార్షికమగు నొక గుల్మము.

ఆకులు
- కొంచమించు అభిముఖ చేరికగా వుండును. అండాకారము, లఘు పత్రములు, తమ్మెలు గలవు. అడుగు వైపున రోమములు గలవు. కొన్ని రకములలో ఆకుల మీదను కొమ్మమీదను ముళ్ళు గలవు.
పుష్పమంజరి
- మధ్యరంభమంజరులు సరిగాగణుపు సందుల నుండవు. సాధారణముగ నొక్కొక్కచో రెండు మంజరులుండును. ఒక దాని పై నొ