ఈ పుట ఆమోదించబడ్డది
299
ని చివర తెల్లరోమములు గలవు. వీని మూలమున గింజలు గాలికెగిరి దూర దూరముగ బోగలవు.
- సుగంధి తీగె.
- సుగంధి
- - తీగె హిందూస్థానమున విశేషముగ పెరుగుచున్నది. దీని నులు తీగెలు లేవు.
- ఆకులు
- - అభిముఖ చేరిక. లఘు పత్రములు. అన్ని ఆకులు ఒక తీరున వుండవు. విషమ రేఖ పత్రము సమాంచలము. అడుగు వైపున మెత్తని రోమములు గలవు.
- పుష్ప మంజరి
- - వృంతములు పొట్టివి. కణుపు సందుల నుండి మధ్యా రంభ మంజరులు పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగ నుండును., సరాళము సంపూర్ణము.
- పుష్ప కోశము
- - అసంయుక్తము. 5. 5 రక్షక పత్రములు. కొన సన్నముగా వుండును. నీచము.
- దళ వలయము
- - సంయుక్తము తమ్మెలు దట్టముగా వుండును. అవి అయిదు ఒక దాని నొకటి మొగ్గలో తాకు చుండును. రెండేసి తమ్మెల మధ్య దళవలయము నంటుకొని 5 పాలుసులు గలవు.
- కింజల్కములు-
- కాడలు విడివిడిగానే వున్నవి. కాని పుప్పొడి తిత్తులు గలసి యున్నవి. ఒక్కొక్కగదియందు నాలుగేసి జతల పుప్పొడి ముద్దలు గలవు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. రెండు స్త్రీ పత్రములు రెండు విడిగా వుండును. కీలము ఒకటి. గింజలుచాలగలవు.