298
- పుష్ప కోశము
- - సంయుక్తము 5 తమ్మెలు గలవు. నీచము.
- దళవలయము
- - సంయుక్తము కాని మొదటి వరకు చీలి యున్నది. తమ్మెలైదు తమ్మెల లోపల వైపున మెత్తని రోమములు గలవు.
కింజల్కములు:- ఇతర పుష్పములందున్నట్లు కింజల్కములు కాన రావు. కాని కిరీటము నంటి ఒకటి వున్నది. 5 చులుకల వంటివి కలసి యున్నవి. ఒక్కొక్క చిలుక, ఒక కింజల్కము నుండి వచ్చినది. ఇక వేరే కాడలు లేవు.
పుప్పొడి తిత్తులును మారియున్నవి. ఆచిలుకల పైన గుండ్రముగ ఐదు పలకలది యొకటున్నది. దాని మీదనే పుప్పొడి తిత్తులు గలవు. ఒక పుప్పొడి తిత్తి యొక్క రెండు గదులు గలసి లేవు. పుప్పొడి ఇతర పుష్పములలో నున్నట్లు రేణువులవలె లేదు. అంతయు కలసి ఒక ముద్ద వలె నున్నది. అట్టిముద్ద గదికొకటి యున్నది.
ఒకపుప్పొడితిత్తి యొక్క ఒకగదిలోని ముద్ద ప్రక్కన వున్న పుప్పొడి తిత్తి గదిలోని ముద్దతో కలసి యున్నది. వీనిని రెండింటిని గలుపుచు నల్లని చుక్క వంటిది వాని మధ్యన గలదు. ఇట్టి ఐదు మూలలను ఐదు గలవు. ఈ పుష్పము నందు పుప్పొడి ముద్దలు క్రిందకు, వీనిని గలుపు నల్లని చుక్కలు పైకి వున్నవి.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము రెండు గలవు. ఇవి రెండును కిరీటములులో మధ్య మరుగుగు పడి వున్నవి. కీలము ఒకటియే. కీలాగ్రము గుండ్రము. ఇది పుప్పొడి తిత్తుల మధ్య నున్నది. రెండు కాయలు కాచును. ఏకదారుణ ఫలము గింజలు చాల గలవు. అవి పలుచగ నుండును. మరియూ వా