పుట:VrukshaSastramu.djvu/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

ఇది పెద్దకుటుంబమే. ఈకుటుంబములోని మొక్కలు మనదేశములో చాల గలవు. వీనిలో విస్తారము తీగెలే. అన్నిటిలోను పాలుగలవు. ఆకులు అభి ముఖ చేరిక, లఘు పత్రములు. సమాంచలము. పుష్పములు. మధ్యారంబ మంజరులు. 5 రక్షక పత్రములు, 5 ఆకర్షణ పత్రములు . ( ఇవి కలసి యుండును) 5 కింజల్కములు గలవు. సాధారణముగ పొలసులు వుండును. ఇవి విడి విడి గా నైనను, అన్నియు కలిసి యైనను దళ వలయము నంటి యైనను, కింజల్కముల నంటి యైనను వుండును. అండ కోశములో రెండు విడివిడిగ నున్న స్త్రీ పత్రములు గలవు. గింజలకు సాధరణముగ రోమములుండును.

జిల్లేడు మొక్కలలో రెండు రకములు గలవు. కొన్నిటి పువ్వులు తెల్లగానుండును. మరి కొన్నిటివి కొంచెము నీలిరంగుగానుండును. ఇదియే నల్ల జిల్లేడు అని అందురు. ఈ మొక్క వాయు దేవునకు ప్రతి యనియు రుద్రునకు ప్రీతి యనియు కొందరును, వారి వారి దేవులకు ప్రీతియని అరబ్బీలును, మహమ్మదీయులును దీని పుష్పములతో పూజ చేసెడి వారు. జిల్లేడు మొక్క ఉపయోగకర మగునదియే కాని దానిని అశ్రద్ధ చేయు చున్నారు.

ఈ మొక్కలనుండి మంచి నారతీయ వచ్చును. ఈ నారతో వలలు అల్లినచో చిర కాలము చీకి పోకుండ వుండును. మరి