పుట:VrukshaSastramu.djvu/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

279

ఈకుటుంబము ఉష్ణదేశములందు మాత్రము గలదు. దీనిలో చెట్లు, గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక. సమాంచలములు. వీని పువ్వులలో పుష్ప కోశము రెండు వలయములుగ నున్నచి. కొన్నింటిలో దళ వలయపు తమ్మెలు లోపలి వైపునను, గొన్నింటిలో పై వైపున పొలుసులు గలవు.

పొగడ పువ్వులు చాలమంచి వాసన వేయును. ఇవెండి పోయినను వాసన పోకుండును. వీనియందొక విశేషము.

సపోటాచెట్టును గొంచము దీనిని పోలికాగానే యుండును. పువ్వుల కంటె చిన్నవి. ఆరు గొడ్డు కింజల్కములున్నవి. ఇవియు అకర్షణ పత్రముల వలెనే కనుపట్టును. దీని పండ్లు తిందురు. ఇవి రుచిగా నుండును. బలమును గలించును.

ఇప్పచెట్టు కొండ ప్రదేశములలో పెరుగును. ఆకులు కొమ్మలచివర గుబురులు గుబురులుగా నుండును. దీని పువ్వులని కొందరు తిందురు. కలపయు గట్టిగా బాగుగనే యుండును. కొన్ని చోట్ల నీ పువ్వుల నుండియే, మత్తుకలుగ జేయు ద్రవము తీయుచున్నారు. దీనిగింజలనుండి వచ్చు చమురు ఆముదము కంటె చిక్కగ నుండును.