ఈ పుట ఆమోదించబడ్డది
280
పెద్ద ఇప్పచెట్టును మన్యములందు ఎక్కువగా బెరుగు చున్నది. ఆకులు బల్లెపాకారము. పువ్వుల కాడలు పొడుగుగ నుండును. ఈ చెట్టును చాల లాభ కారియగు చున్నది. దీని పువ్వులను పేద వారలు పోగు చేసికొని, ఎండబెట్టి ఆహార పదార్థముగ నుపయోగించు చున్నారు. గింజల నుండి తీసిన చమురును వారు నేతికిని కొబ్బరి నూనెకూ బదులుగ కూడ వాడు కొందురు. దీనితో దీపములు గూడ పెట్టు కొందురు. అది సబ్బు చేయుటకును పనికి వచ్చును. ఈ నూనెయు, బెరడును ఉడక బెట్టిన ఆకులను గజ్జి మొదలగు వ్యాధులను బోకొట్టుటకు ఉపయోగించురు. దీని కలపయు చాల గట్టిగా నుండును.
తుమ్మిక కుటుంబము.
- తుమ్మిక చెట్టు
- కొండ ప్రదేశములందు పెరుగును.
- ప్రకాండము
- - ఇరువ్ది, ఇరువది అయిదు అడుగు లెత్తున పెరుగును. బెరడు గొగ్గి గిగ్గిలుగా నుండును. కొమ్మలు చాలగలవు. లేతకొమ్మల మీద మెత్తని రోమములు గలవు.
- ఆకులు
- - ఇంచు మించు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ, లఘు పత్రములు. నిడివి చౌక సాకారము. సమాంచలము. లేత వానిపై రోమములు గలవు.
- పుష్పమంజరి
- - పురుష పుష్పములు కణుపుసందులనున్న వృంతము మీద మూడో,. నాలుగో యుండును. ఉపవృతములును, వాని వద్ద రే