పుట:VrukshaSastramu.djvu/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

275

కుసుంబనూనెను రెండువిధములుగ దీయు చున్నారు. కాయలను వెచ్చ బెట్టకయె దీయుట యొకటి. వెచ్చ బెట్టి దీయుట ఒకటి. వెచ్చ బెట్టిన యెడల నెక్కువ వచ్చుట సత్యమే గాని అది మంచి రకముగాదు. పచ్చి నూనెను వంటకములందును, సబ్బులు చేయుటకును, తక్కువ రకము దీపములు పెట్టుటకును బనికి వచ్చును. వంట చమురు వీనికి బనికి రాదు గాని పచ్చి చమురునకు లేని మరియొక లక్షణము దానికి గలదు. దానిని చర్మములకు రాచిన యెడల వానిని నీటిలో ముంచినను నవి పాడు కావు. నీళ్ళు తోడుకొని పోవు తోలు తిత్తులులకు నీనిని రాయు చుందురు.

కొందరు దీని చిగుళ్ళను వండు కొనియు గింజలను వేయించుకొనియు తిందురు.

నల్లతపత మొక్క అక్కడక్కడ మెలచు చున్నది. ఆకులు కొమ్మనంటి పెట్టుకొని యుండును. అడుగున నున్నవి బల్లెపాకారము. పైనున్నవి బాణపాగ్రాకారము. పువ్వులు పెద్దవి. పచ్చగా నుండును. ఈ మొక్కలో పాలు గలవు.

ఎత్రింట
మొక్కలో అడుగున వున్న ఆకులకు పక్ష వైఖరిని దీర్ఘములగు తమ్మెలున్నవి. పై ఆకులు బాణాగ్రాకారము. వీనిలోను పాలు గలవు.