ఈ పుట ఆమోదించబడ్డది
276
చందుగల్ల కూర సాధారణముగ మెరక్ నేలలందు మొలచు చుండును. ఆకులు బల్లెపాకారము. బంతులు కొమ్మల చివరన నుండును. అన్నియు మిదున పుష్పములే.
- మరాట తీగె
- - ముదురు మొక్కలలో ప్రకాండము నేల మీద బడి వేరులు వేయు చుండును. ఆకులు అభిముఖ చేరిక. అండాకారము పువ్వులు కోలగ నుండును.
- చామంతి
- - చిన్న మొక్క, దీని పువ్వులు మిగుల అందముగా నుండును. దీనిలో తెల్ల రకము కూడ గలదు.
- ప్రొద్దు తిరుగుడు మొక్కను దోటలందు పెంచు చుందురు. ఆకులు హృదయాకారము. పువ్వులు పెద్దవి. కాడలు పొడుగుగ నుండుట చే వంగి యుండును.
బంతి మొక్క ఇతర దేశములనుండి మన దేశమునకు తేబడినది. దీనిలో రేక బంతి, ముద్ద బంతి యను రెండు రకములున్నవి. కొన్నిటి పువ్వులు పచ్చగ నుండును. కొన్నిటివి నారింజ రంగుగ నుండును.
టెంకీసు మొక్కలు చిన్నవి. వీని పువ్వులు పలు రంగులుగ చామంతి పువ్వుల కంటె పెద్దవిగా నుండును. ఇవియు మన దేశము లోనివి కావు.