పుట:VrukshaSastramu.djvu/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

లేవు. కొన్ని చోట్ల వానిపుష్పములనుండి రంగు చేయుటకును, కొన్ని చోట్ల గింజలనుండి చమురు తీయుటకూ పైరు చేయుచున్నారు.

ఈ మొక్కలకు కొంచ మిసుకనేల మంచిది. దీనిని విత్తనములు ఇతర మెట్ట పైరులతో జల్ల వచ్చును. నాలుగైదు నెలలకు పుష్పింప నారంభించును.

మొట్టమొదటక నొక పూవు పూయుటకారంభింప బో చుండగనే చిగురును త్రుంచి వైతురు. అందుచే కొమలు వేసి అవన్నియు పుష్పిచును. పుష్పములను కోసి యింటికి కొని పోయి నీడ నార బెట్టుదురు. ఆరిన పిదప చేతులతో నలుపుచు జల్లెడ వలె గంతలు కంతలుగల బుట్టలో నీళ్ళతో పసుపు రంగు లేకుండ నీరు శుబ్రముగ పోవునంత వరకు కడుగుదురు. తరువాత వాని నార అబెట్టి ముద్ద వలె జేసి అమ్ము చున్నారు. ఈ రంగు వేయు వారలు వీనినే కొనుక్కొనెదరు. ఈ రంగు వాడుకయు ఇప్పుడు తగ్గిపోయెను.

1875 సంవత్సరముల ప్రాంతముల మన దేశము నుండి 650827 రూపాయల సరకు ఎగుమతి యగు చుండెను. తత్పూర్వమింకను నెక్కువ గలదు.