పుట:VrukshaSastramu.djvu/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

273

రోమమము వలె నుండును. ఇట్లుండుట వలన ఎండు కాయలు గాలి కెగరి దూరముగా బడుటకు వీలగు చున్నది. పుష్పములలో కొన్ని మిధున పుష్పములు గను కొన్ని ఏకలింగ పుష్పములగను నున్నవి. మిధున పుష్పములు. పుష్పమంజరికి మధ్యను ఏక లింగ పుష్పములు చుట్టు నుండును. పుప్పొడి తిత్తులన్నియు గలసి యుండును. అండాశయము ఒక ఫలము ఎండు కాయ బ్రద్దలవదు. కీలము చివర రెండుగా చీలి యుండును.

బంతిలోని పుష్పములు కొన్ని గొట్టముల వలెను కొన్ని నాలుకవలె వెడల్పుగ నున్నవో అన్ని పుష్పములను గొట్టముల వలె నున్నచో చేటిక లాకుపచ్చగ నున్నవో మరియొక రంగుగ నున్నచో వృంతాగ్రము పై పొలుసున్నవో లేవో మొదలగు అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను తెగలుగను విభజించి యున్నారు.

కుసంబ మొక్కలను బొంబాయి, బంగాళా దేశములందు కొన్ని చోట్ల పైరు చేయు చున్నారు. దీని యాకులు వెడల్పుగను బల్లెపాకరముగను నుండును. తొడిమ లేదు. ఈ మొక్కలో ముఖ్యమైనవి రెండు రకములున్నవి. ఒకదాని ఆకులు బిరుసుగను ముళ్ళుగలవిగను వున్నవి. రెండవదానికి ముళ్ళు