పుట:VrukshaSastramu.djvu/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

పుష్ప కోశము
- రక్షక పత్రములు టేకులవలె నుండక రోమములవలె మారి యున్నవి. ఉచ్చము.
దళ వలయము
- సంయుక్తము. చుట్టు నున్న పుష్పము యొక్క దళ వలయము నాలుక వలె వెడల్పుగ నుండును. మధ్య పుష్ప దళవలయము సన్నని గొట్టము వలె నుండును.
కింజల్కములు
- అయిదు. కాడలు దళ వలయమున కంటె చిన్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అన్ని పుప్పొడి తిత్తులును ఆనుకొని యుండును.

అండ కోశము:- అండాశయము నీచము. ఒక గది. ఒక అండ కీలము మొదట కింజల్కముల కన్న పొట్టిగ నుండి, క్రమము వాని కంటే పెద్దదై పుప్పొడి తిత్తుల మధ్య నుండి చీల్ల్చుకొని పైకి పోయి రెండు కీలాగ్రములగా చీలును.

చామంతి పుష్పములో గొట్టము వలెనున్న పుష్పములు లేవు.

ఇది యొక పెద్ద కుటుంబము. ప్రపంచములో నన్ని భాగముల యందును దీనిని కనుగొననగును. ఈ కుటుంబములోని అన్ని మొక్కలన్నియు గుల్మములు, ఆకులు చాల భాగము పర ఒంటరిచేరిక కాని కొన్నిటికి మాత్రమభి ముఖచేరిక. వృంతాగ్రముపై సాధరణముగా పొలసులుండవు. పుష్పకోశము కొన్ని పుష్పములలో పొలుసులు వలెను కొన్నిటిలో