ఈ పుట ఆమోదించబడ్డది
169
- మంజిష్టలత
- - చాల పెద్దది. అదిచెట్లమీద బ్రాకుచుండును. మాను లావుగనే యుండును. ఒకజత ఆకులు పెద్దవి. ఒక జత ఆకులు చిన్నవి. దీని వేరునుండి కూడ ఎర్రని రంగు వచ్చును. దీనిని తొగరు వేరు వలెనే వాడుదురు కాని బెరడును వేరు చేయ నక్కరలేదు. దీనితో రంగు వేయుటయు నిప్పుడు తగ్గిపోయెను.
- నూకు కాడ
- - వరి చేల గట్ల వద్ద ఒక అడుగెత్తు మొలచును. ఆకులకు తొడిమ లేదు. చిన్నచిన్న తెల్లని పువ్వులను పూయును.
- మదన బుంత కాడ
- - సముద్రతీరములందు మొలచును. కొమ్మలు నాలుగు పలకలుగా నున్నవి. పువ్వులు కణుపు సందులలో మూడేసియో నాల్గేసియో యుండును.
- బంధూకము
- - అందముగానుండు గుబురు మొక్క. కొమ్మలు భూమి వద్దనుండి పుట్టు చున్నవి. ఆకులు కొమ్మనంటిపెట్టుకొని యుండును. పువ్వులు ఎరుపు.
- తడ్డపళ్ళు చెట్టు
- - పర్వతములమీద పెద్దదిగానే పెరుగును. ఆకులతొడిమ చాల పొట్టిది. దీని పువ్వులు తెల్లగాను వాసన గాను నుండును.