Jump to content

పుట:VrukshaSastramu.djvu/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

నూనిపాపడ
- డొంకలవద్దను మార్గములప్రక్కన దరుచుగాబెరుగు చిన్న మొక్క. తెల్లని పువ్వులు గుత్తులు. మంచి వాసన వేయును.

పాపటయు పై దాని వలెనే యుండును గాని, దీని ఆకులు సన్నగా నుండవు. రెండు వైపుల రోమములు గలవు.

వెర్రి నల్లవేము
- మార్గములప్రక్కను మొలచు చిన్న మొక్క ఆకులు బల్లెపాకారము. వానికితొడిమ లేదు. కణుపు సందుల రెండు పువ్వులుండును.
కొమ్మి చెట్టు
- చిన్నది బెరడు నల్లగాను, నున్నగానుండును. ఆకుల దట్టముగా ఉన్నవి దీని తెల్లని పువ్వులు మంచి వాసన వేయును.

కరింగవచెట్టు చిన్న చెట్టు. పువ్వులు పెద్దవి. ప్రొద్దుటే వికసించి నపుడు తెల్లగా నుండును. కాని క్రమక్రమముగా బచ్చపడును.

గార్గ చెట్టు
కొండల మీద బెరుగును. శీతాకాలములో ఆకులు రాలి వసంత ఋతువులో చిగురింప నారంబించును. పువ్వులు మంచి వాసన వేయును.