పుట:VrukshaSastramu.djvu/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

మార్పులుగలుగునో తెలిసికొనుట రసాయన శాస్త్ర సహాయము లేనిదే కష్టము.

ఇప్పటికి మొత్తము మీద 4350 ఎకరముల క్వినైను చెట్లక్రిందనున్నవి. అన్య దేశముల నుండి క్వినైను దిగుమతి చేసి కొనుటమానినాము. మరియు సంవత్సరమునకు మన (మన గవర్నమెంటు వారికి) 138660 రూపాయలు లాభము కూడ వచ్చు చున్నది.

చిరి వేరు:- చిరి వేళ్ళ బెరడులో గూడ నెఱ్ఱని రంగు కలదు. బట్టల రంగునకు వీనిని కూడ ఉపయోగించురు. ఈ మొక్కలు ఎసుక నేలలో బాగుగ మొలచును. విత్తులు చల్లబోవుటకు ముందు పొలములో మంద గట్టుదురు. విత్తనములు చల్లిన తరువాత మొక్కలు మొలచు వరకును దినమునకు మూడు మారులు చొప్పున నీరు పోయు చుండ వలెను. మొదటి పదునైదు దినములు నీళ్ళలో పేడ కూడ కలుపుదురు.

దీని వేళ్ళను నీళ్ళతోనూరియో, దంపియో రసము దీసి ఆరసములో బట్టను నాన బెట్టి రెండు గంటలు మరుగ బెట్టిన తరువాత ఉతికి ఆర వేయుదురు. బట్టకు మంచి ఎఱ్ఱరంగు వచ్చును.