Jump to content

పుట:VrukshaSastramu.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

261

లో మంచి వానిని నేలకుదగు వాని నేరుకొన వలయును. లేత కాయలలోని గింజలు మంచివి కావు. కాయలు పూర్తిగ పండిన తరువాత వాని గింజలను తీసి కడిగి నీడ నారబోయ వలెను. కొందరు పండ్ల నుండి తీయగనే పాతినచో మొక్క బాగుండునని తలచు చున్నారు. ఈ గింజలను మొదట మళ్ళలో పాత వలెను. ఈ మళ్ళ కొరకు నేర్పరిచిన నేలలో వెనుక కాపీ మొక్కలు మొలచెనా యవి మంచివి కావు. అక్కడ విస్తారము చెట్లున్నచో, నీడకు గావలసిన వాని నుంచి మిగిలినవి కొట్టి వేయ వలయును. మరియు నీ మళ్ళకు ఏర్పరచు వానికి నీటి సదుపాయము బాగుండ వలెను. మళ్ళలో ఏడాది ఎదిగిన పిమ్మట వానిని దీసి చేలలో పాదుదురు. కొందరు రెండేండ్ల వరకు మళ్ళలోనే యుంచెదరు. వీనిని చేలలో పాతునపుడు చేలను శుభ్రముగా ద్రవ్వ వలెను. డబ్బునకు వెనుదీయనిచో మొక్కలను పాతు చోట పెద్ద పెద్ద గోతులు త్రవ్వి కొన్ని దినముల వరకు ఎండ కెండుచు, వానకు దడియుచు నట్లుండనిచ్చెదరు. తరువాత వానిని, ఎరువు, గడ్డి మొక్కలు, మన్నులతో (ఇదివరకు త్రవ్వి తీసిన మన్ను గాదు) పూడ్చెదరు. అవి కొంత కాలమైన తరువాత లోపలకు క్రుంగును. పిమ్మట నచ్చోట, పేడను ఇతర ఎరువులను వేయుదురు. మొక్కలు మబ్బుగానున్నప్పుడు పెద్ద వర్షములు కురియ కుండా నున్నప్పుడు పాతుట