260
కాపీ మొక్క మన దేశము లోనిది గాదు. ఒక మహమ్మదీయుడు మెక్కానుండి తిరిగి వచ్చునపుడు ఏడు గింజలను దెచ్చి మైసూరులో మొట్ట మొదట పాతెనని ప్రతీతి గలదు. ఇంచు మించుగ ఆ కాలమందే ఈస్టు ఇండియా కంపెనీ వారు కూడ హిందూస్థానము నందు కాఫీ మొక్కలను పెంప దొడగిరి. కాఫీని మొదట త్రాగ నేర్చిన వారరేబియా దేశస్తులు. వారు కాపీ రుచుల తోడనే కషాయము చేసే వారు. పారసీకులే గింజల పొడుముతో చేయ నారంబించిరి. కాఫీ పంట క్రింద నున్న మొత్తము 196318 ఎకరములలోను విస్తారము చెన్న రాజ్యము, మైసూరు, తిరువాన్కూరు లలోనే గలదు.
ఈ మొక్కలకు రాతి నేల గాని విస్తారము బిరుసుగానున్న నేల గాని మంచిది కాదు. వేళ్ళు సులభముగ పారుటకు భూమి వీలుగ నుండ వలెను. మరియు దీనికి 1500 వందలు మొదలు 5500 అడుగుల వరకు ఎత్తుగా నున్న ప్రదేశములు మంచివి. విస్తారము ఉష్ణము కూడదు. ఎక్కువగా వర్షములు అక్కర లేదు. పెద్ద పెద్ద సుడి గాలులు వచ్చు చుండిన మొక్కలు బాగుండవు.
మొక్కలు పెంచుటకు విత్తునెన్నుటలో చాల శ్రద్ధ కావలయును. కాపీవిత్తులలో ఎన్నియో రకములు గలవు. వా