పుట:VrukshaSastramu.djvu/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

మంచిది. పాతిన వెంటనే యెక్కువగా ఎండలు కాసిన యెడల రెండు మూడు మార్లు తడి పెట్ట వలయును. మొక్కలను దూర దూరముగ పాతుట మంచిది. ఎంత దూరముననో, అది, భూమిని బట్టియు, కాపీ రకమును బట్టియు నుండును.

కాపీ తోటలలో నీటి పారుదల బాగుగ నుండ వలెను. కాలువలు లోతుగా నుండుట మంచిది.

కాపీ మొక్కలను పాటుటకు పూర్వమాచోటును దున్నుట గూర్చియు, త్రవ్వుట గూర్చియు, ఆకులు గప్పుట కూర్చియు పలువిధములగ చెప్పుచున్నారు. త్రవ్వకుండనున్న యెడల మొదటి ఒకటి రెండు సంవత్సరములలో పంట తక్కువగా నుండును. మరియు వెనుకటి మోడులేమైన నుండును గాన అగ్ని బయమును గలుగ జేయ వచ్చును. ఆకులను గప్పెనేని, అవి కుళ్ళును గాన, నెరువు వేసినంత పని చేయును. మొక్కలు ఏపుగా బయలు దేరును. మరియు ద్రవ్వక పోవుట వలన గలుగు నష్టమును బాపును.

ఈ మొక్కలకు చేప పెంట, తెలక పిండి, ఎముకలు, పేడ మొదలగు వానిని ఆయా నేలలకు కావలసిన వానిని ఎరువుగా వేయుదురు. ఎరువువేసెడు కాలమును అన్ని చోట్ల నొకటి కాదు. మొక్కలు పాతగనే ఎరువు వేసిన అవి ఏపుగా బయలు దేరును. పుష్పించు నపుడు ఎరువు వేసిన విరివిగా గాచును.