ఈ పుట ఆమోదించబడ్డది
246
గుత్తి బీరయు బీర తీగె వలెనే యుండును. కాయలు చిన్నవి. నున్నగా నుండును. వీనిలో పీచు మెండు.
నేతి బీర ఆకులు మిశ్రమ పత్రములు. కాయలు పెద్దవి. బీరకాయ మీదనున్నట్లు అంచులు లేవు. నున్నగా నుండును. దీనిలో పీచు విస్తారముగా గలదు. ఈ పీచును మేజోళ్ళు "బ్రషు చేయుటలో వాడు చున్నారు.
కాకరాకులు మిశ్రమ పత్రములు. కాయలు చేదుగా నుండును. అయినను మనము కూర వండు కొందుము. కాయలు పండినపుడెర్ర బడును.
అఝర కాయలు చిన్నవి. ఇవియు చేదుగానె నుండును. వీనిని కూర వండుకొందుము.
దోస కాయలలో పందిర దోస కాయలని నక్క దోస కాయలని రెండు ముఖ్యమైన రకములు గలవు. పందిర దోస కాయలు వర్షాకాలములో గాని కాయవు. నక్క దోస గింజలు పాతిన పిదప పదిదినముల వరకు నీరు పోయుచుండవలెను. ఈ కాయలు పుల్లగా నుండును.
దోసకాయలు దోస కాయల వలెనే యుండును. కాయలు రెండడుగుల పొడుగు వరకు కూడ పెరుగును. వీని