పుట:VrukshaSastramu.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

247

పై మొట్టమొదట నల్లని చారలుండును. పండిన తరువాత తెల్లగానైనను నారింజ రంగుగానైనను మారును.

ఆనపకాయలు కూడ శీతాకాలములో కాయును. పువ్వులు తెలుపు. కొన్ని కాయలు గుండ్రముగాను, కొన్ని కోలగాను నుండును. లేత కాయలు కూర వండు కొందుము. ముదురు కాయలను దొలిచి బుర్ర లెండ బెట్టి వేణెలకు, తాంబురలకు ఉపయోగించెదరు. పాముల వాండ్రూదు నాగ స్వరము, ఆనప బుర్రలతోడ జేయుదురు.

పుచ్చ కాయలు ఇసుక నేలలో ఏపుగా బయలు దేరును., కాయలు కోలగాను, ఆనప కాయలకంటే చిన్నవి గాను నుండును. వీనిని కూర వండుకొందురు.

కర్బోజ కాయ కొంచెము గుండ్రముగా నుండును. పై చర్మము ఆకు పచ్చగా నుండును గాని లోపల కండ కొంచెము గులాబి రంగుగా నుండును. గింజలు నలుపు. చలువ చేయునని ఈ పండ్లు వేసవి కాలమందు తినెదరు. వీని గింజలు కూడ ఉపయోగ కరములగు చున్నవి. వాని నుండి తీసిన చమురు సబ్బుచేయుటకు పనికివచ్చును.