పుట:VrukshaSastramu.djvu/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిపాంచన చెట్టు:- చిరిమాను చెట్టువలెనే యుండును గాని మాను అంత పొడుగుగాను సూటిగను వుండదు. మరియు నీరుదగిలిన పుచ్చుట నారంభించును.

బొద్దు తీగె పెద్దది. అడవులలో చెట్ల మీద ప్రాకును. కాయలకు ఐదు రెక్కలు గలవు.

బండిమురుదుడు: శీతాకాలములో పుష్పించును.


నేరేడు కుటుంబము.


నేరేడు చెట్టు: పెద్దది. అది చాల చోట్లనే పెరుగు చున్నది.

ఆకులు:- అభిముఖచేరిక, లఘుపత్రములు. తొడిమకలదు. కణుపు పుచ్చములు లేవు. నిడివి చౌక పాకారము. సమాంచలము. నున్నగాను దట్టముగాను నుండును. కొన యందు చిన్న వాలముగలదు. అంచు చుట్టు ఈనెగలదు.

పుష్పమంజరి:- కణుపుసందుల నుండి రెమ్మ గెలలు, పుష్పములు సరాళము సంపూర్ణము.

పుష్పకోశము:- చిన్న చిన్న రక్షకపత్రములు. ఇవి ఒక్కొక్కప్పుడు అడుగున కలసి యుండును. ఉచ్చము.

దళవలయము:- అసంయుక్తము. ఆకర్షణపత్రములు నాలుగు చిన్నవి. గుండ్రముగాను ఆకుపచ్చగాను నుండును. పుష్పకోశము నంటి యున్నవి.