పుట:VrukshaSastramu.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుచున్నవి. పువ్వులుచిన్నవి. దురువాసనగలదు. కాయలనుదిందురు గాని చాల తినినచో మత్తు కలుగ జేయును. వీనిని ఔషధములలోను, రంగు చేయుటకును చర్మములు బాగు చేయుటకును వాడుదురు. ఈ చెట్టు నుండి వచ్చు జిగురు తుమ్మ జిగురు వలె నుండును గాని నీళ్ళలో కరుగదు. కలప పెళుసుగా నుండును గాన సన్న పనులకు బాగుండదు. నాగళ్ళు మొదలగునవి చేయవచ్చును.

తాండ్ర చెట్టు నలుబది ఏబది అడుగుల ఎత్తు పెరుగును. కాయలు గుండ్రముగాను ఎర్ర్గగాను యుండును.

చిరిమాను:- చెట్టు ఎత్తుగా పెరుగును. పువ్వులు పచ్చగా నుండును. కలప గట్టిగా నుండుటచే దూలములుగ నుపయోగింతురు.

నిమిరి చెట్టు నుండియు మంచి కలప వచ్చు చున్నది.

వెల్లనాగ:- చెట్టు చాలచోట్లనే పెరుగుచున్నది. దీని బెరడును చర్మములు బాగు చేయుటలో పనికి వచ్చును. కలపయు గట్టిగానేవుండును. గొడ్డలి మొదలగు వాటి కాములకును, ఓడలుకట్టుటలోను, రైలుపట్టాల క్రింద బరుచుటకును బనికి వచ్చును.