Jump to content

పుట:VrukshaSastramu.djvu/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరక్కాయిచెట్టు:- కొండలమీదను, బయలు ప్రదేశములందును కూడ పెరుగు చున్నది. కరక్కాయల వ్యాపారము మెండుగా గలదు. కరక్కాయ బెరడును పటికయు కలిపి నీళ్ళు గాచి ఆనీళ్ళలో బట్టలు వేసిన పచ్చని రంగు పట్టును. కాని తరచు నల్ల రంగు, తోపు రంగు అద్దుటలో ఎక్కువగ దీనినుపయోగింతురు. అన్న భేదితో కూడ కలిపి కాచిన యెడల నల్లని సిరా వచ్చును. ఈ కాయలను చర్మములు బాగు చేయుటలో ఎక్కువగా ఉపయోగించు చున్నారు. వీని నౌషధములలో కూడ ఉపయోగించు చున్నారు. ఈచెట్ల కలపయు గట్టిగానె యుండును.

బాదముచెట్టు:- చాల చోటులనే పెరుగు చున్నది. పువ్వుల కంకుల మీద పైన మిధున పుష్పములును, అడుగున పురుష పుష్పములున్నవి. ఇవి త్వరగా రాలి పోవుచుండును. ఈ చెట్టు నుండియు జిగురు వచ్చును. లేత ఆకులను బెరడును ఔషధములలో ఉపయోగింతురు. ఆకులు పెద్దవిగా నుండుట చే విస్తళ్ళు కుట్టు కొనుటకు బాగుగనే యుండును. కాని, ఎండి నిలవ యుండమిచే లాభములేదు. కాయలు సీమ బాదము కాయల వలెనే యుండును గాని, పప్పు అట్లుండదు. దీని నుండి తీసిన చమురు సీమ బాదము నూనెను బోలి యుండును.

తొండ్ల చెట్టు అడవులలోను గొండల మీదను పెద్దదిగా బెరుగును. ఆకులు కొమ్మల చివర గుబురుగా పెరు