పుట:VrukshaSastramu.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొట్టమును రెండవపాత్రయు చల్లని నీళ్ళలో నుండుటచే ఆవిరి మరల నీరై ఆ పాత్రలో బడును. మరల పువ్వులను వేసి కాచు నపుడు వట్టి నీరు బోయక ఆ పాత్రలోనికి వచ్చిన దానిని బోసెదరు. ఇది మరల బాత్రలోబడిన తరువాత నొక గాజు తొట్టిలో జేర్చి వారము దినములు ఎండ బెట్టుదురు. తరువాత దానిపై గట్టిగ మూత వేసి తడి రాగిడి మట్టిని పూసి ఒక రాత్రి యంతయు నీళ్ళున్న ఒక గోతిలో బెట్టుదురు. మరునాటి ఉదయమునకు అత్తరు పైకి తేలి యుండును. దీనప్పుడు వేరు జేసి సీసాలలో వేసి అమ్ముదురు. కొందరు గులాబి పువ్వులతో మంచి గందపు చెక్కలను గలిపి బట్టి పట్టు చున్నారు. మనకు సాధారణముగ బజారులలో దొరకు పన్నీరు నందు విస్తారముగ నీళ్ళు గలవు.

ఆల్బకర చెట్టు:- మన దేశములో పంజాబు నందును హిమాలయా ప్రాంతము లందును పెరుగుచున్నది. దీని కాయలు తినుటకు బాగుండును. అవి పుల్ల పుల్లగా నుండి అపథ్యము కామిచే రోగులకుకూడ తినుటకు ఇచ్చుచుందురు.

సీమబాదము:- చెట్లు మనదేశములో పంజాబు కాశ్మీర రాష్ట్రములందు మాత్రము పెరుగుచున్నవి. కొన్ని చె