గులాబి మొక్క చిర కాలము నుండి మన దేశములో పెరుగు చున్నది. దీనిలో చాల రకములున్నవి. కొన్నింటియ్ందు రేకు లెక్కువగా నున్నవి. కొన్ని ముదురు రంగుగను, కొన్ని మిక్కిలి లేత రంగుగను నున్నవి. మరికొన్ని తెల్లగా నున్నవి. ఈ భేదములన్నియు ఇంచు మించు సేద్య భేదము వలన వచ్చినవని చెప్పుచున్నారు.
గులాబిపువ్వు మిక్కిలి మనోహరమైన పుష్పము. ఇది ఇంపుగాను సువాసన గాను నుండును. దీని నుండియే అత్తరు చేయుదురు. మొట్ట మొదట అత్తరు జహంగీరు నూర్జహానుని వివాహమాడినపుడు చేసిరట.
అత్తరుచేయుటకు పువ్వులను ప్రొద్దున కోసి ఒక యంత్ర శాలకు గొనిపోయి అచ్చట బట్టిలో వేసెదరు. పువ్వులన్నియు నొక పెద్ద కాగులో వేసి నీళ్ళు పోయుదురు. ఈ కాగునకు సన్నని మూతి యుండును. ఈ మూతిలో నుండి మరియొక పాత్ర లోనికి వెదురు గొట్టముండును. వెదురు గొట్టమును, పాత్రను చల్లనినీళ్ళలో బెట్టి కాగుక్రింద సన్నని మంట పెట్టుదురు.
గులాబి వాసన నీళ్ళకు వచ్చును. ఈనీళ్ళు కాగుటచే ఆవిరియై వెదురుగొట్టము ద్వారా బోవును. కాని వెదురు