పుట:VrukshaSastramu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుల్మము లనియు, నందుము. కొన్నిటి ప్రకాండములు వాని కొమ్మలును పైకెదుగనే ఎదుగక పల్లేరు మొక్క యున్నట్లు నేలమీదనే బడియుండును. అట్లున్న కొన్ని కొమ్మలనుండి వేరులుకూడ పుట్టును. మరికొన్ని కొమ్మలు భూమిలోనికే బోయి అడ్డముగా బెరుగుచు తల్లిమొక్క దగ్గరనుండి కొంచెము దూర మేగిన తరువాత పైకి వచ్చును; లేదా దీని నుండి కొమ్మలు పుట్టి అవి పైకివచ్చును. ఇట్లు భూమిలో వ్వాపించి పైకివచ్చువానికి గామినులని పేరు.

రెండవ మొక్క మొదటి దానినుండి వచ్చిన గామిని వల్ల ఏర్పడినది.

కొన్నిటి ప్రకాండములు భూమిలోపలికి బోయి, మార్పు చెంది వేరొక పనిని చేయు చున్నవి. బంగాళ దుంప