పుట:VrukshaSastramu.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టిదే. ఈ దుంప మార్పు చెందిన కొమ్మ. ఈ రీతిని కొమ్మలు భూమిలోనికి పోయి, లావెక్కిన వానిని గడ్డలందుము. అల్లము, పసుపు, అరటి, కంద దుంపలు కూడా ప్రకాండములే.

అల్లము మొదలగునవడ్డముగా బెరుగుచుండ వానిపై నుండి మొక్కలు పైకి వచ్చుచున్నవి. కంద గుండ్రముగా బెరుగుచున్నది. దీని మద్యనుండి యొక మొక్కగలదు. కంద చుట్టు చిన్న చిన్న పిలకలు గలవు. ఇవి క్రమ క్రమముగా బెద్దవగును. కందవలె గుండ్రముగా నుండు వానిని కందములనియు, పొడుగుగా నున్న అల్లము మొదలగు వానిని మూలవహములనియు ననుట వాడుక. ముల్లంగి మొదలగు వేళ్ళును లావుబార, కంద మొదలగు ప్రకాండములును లావుబార ఆ దుంపలు వేరుల మార్పులో, ప్రకాండముల మార్పులో తెలిసికొను టెట్లనెదరేని: .. అవి ప్రకాండము లైనచో,