పుట:VrukshaSastramu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాయుట కీయేడు సంపాదించుకొనిన యాహారమును వేరులలో నిలువ చేసికొను చున్నవి.

ప్రకాండము.

గింజ అంకురింపగనే వేరుభూమిలోనికి బోవునట్లె ప్రకాండము కొమ్మ స్వతస్సిద్ధముగా బైకి పెరుగుచున్నది. వేరునందు వలెగాక దీనిమీద ఆకులు పువ్వులు పుట్టుచున్నవి. ఆకులు పుట్టు చోటును కణుపు అందుము. ప్రకాండమును ఆకును కలిసి కొనుటచే ఏర్పడు కోణము కణుపు సందందుము. రెండు కణుపుల మధ్య నున్న భాగమునకు స్కంధమని పేరు. కణుపు సందులందుండియే మొగ్గలు కొమ్మలు పుట్టును. అన్ని మొక్కల ప్రకాండములు ఒక తీరున లేవు. చింత, పనస, మామిడి మొదలగు వానివి చాల ఎత్తుగను లావుగను బెరుగుచున్నవి. జామ, దానిమ్మ, మొదలగు వానియందు, అంత ఎత్తుగాను లావుగను పెరుగుట లేదు; మరియు వీనికి కొమ్మలు మిక్కిలి క్రిందుగానే బుట్టి అన్నియు కొంచమించుమించు గుబురుగా బెరుగుచున్నవి. తోటకూర పసుపు, మెట్టతామర, కుంకపు పువ్వు మొక్క మొదలగు వాని యందు ఎత్తుగగాని లావుగా గాని లేదు; అదిగాక ఇవి తక్కినవాని వలె కొయ్యబారి గట్టిగా లేవు. ఈ భేదములెన్నుటకు, చింత మొదలగు వానిని వృక్షములు (పెద్దచెట్లు) అనియు, దానిమ్మ మొదలగు వానిని గుబురు మొక్కలనియు, మెట్టతామర మొదలగు వానిని