Jump to content

పుట:VrukshaSastramu.djvu/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేరుశనగపప్పునంతగా వాడము. వానియందు పైత్యగుణమెక్కువగా గలదు. వేరుశనగ నూనెను వాడము కాని, అది మిక్కిలి చౌక యగుట చేత నువ్వుల నూనెలో గలిపి దగా చేయు చున్నారు. గింజలను వెచ్చ బెట్టి నూని దీసిన యెడల జాల వచ్చను కాని ఈ నూనె అంత బాగుందు. యంత్రముల మూలమున నూని యాడుచు వచ్చిరి గాని ఈ తెలక పిండికి గాను గాడిన పిండి కున్నంత యమ్మకము లేక నష్టము వచ్చుట చేత, ఆ పద్ధతి మానినారు. సబ్బు చేయుటకును, త్రుప్పు పట్టకుండ యంత్రములకు రాయుటకూ ఈ నూని పనికి వచ్చుచున్నది. దీని నౌషధములలో కూడ వాడేదరు. మన దేశములో బండు పంట ఇంచు మించుగ నంతయు జెర్మనీ మొదలగు పై దేశములకే ఎగుమతి యగు చున్నది.

మెంతిమొక్కలు:- కాయలుగాయ గానే ఎండి పోవును. వాని పువ్వుల రేకులు మూడేసి యున్నట్లు నగపడును గాని అయిదు గలవు. కాయలకు దొడిమ లేదు

ఇవి నీటిప్రదేశములందు బాగుగ మొలచును. సాధారణముగ రెండవ పంటగ, ప్రత్తితో గలిపి పందింతురు. మెంతి కూరను తోట కూర వండుకొని నట్లు వండుకొనెదము. కొందరీయాకును ఎండబెట్టి పొడుము చేసి నిలువ యుంచు కొం